నిరామయం ,నిర్గుణ మౌనం ,సదా స్వతః సిద్దం స్వతః ప్రమాణం ,ఇతి స్వానందం, సదా స్వామి నిర్గుణ చైతన్య కటాక్షం
సాధ్య సాధన రహితం సదా స్వయం జ్ఞాన స్వాత్మ స్వరూపం , ఇతి శ్రీ నిర్గుణ కృపా మాత్రేన ,సదా జ్ఞాన ప్రసాదం పరిపూర్ణ స్వాత్మ స్వకీయ మయా వివర్తన మేహి సదా సర్వ సాక్షి సాక్ష్య స్వరూపం , అణు సహిత సంకల్ప జ్ఞాన సర్వంచ సదా సర్వ సాక్షీ మాత్రం ఇతి ప్రబోధం నిరతం స్వామి నిర్గుణ చైతన్య కటాక్షం పరమార్థ స్వాత్మ దృష్టేన మనో స్వరూపం నిరతం మృష మిధ్య కల్పిత స్వప్న మాత్రం ఇతి మృష వ్యర్ద మనో మాత్ర స్వరూపం సదా నిర్గుణ నిర్గుణ కృ పెన ప్రబోదితం స్వప్న రూప మనో నిగ్రహదికం దుర్లభం ఆప్రయోజనం అ శాశ్వతం చ ఇతి నిశ్చయం స్వామి నిర్గుణ చైతన్య కటాక్షం సనాతన వేద వేదాంత ఉపనిషత్ సారం , స్వామి నిర్గుణ చైతన్య, బోధ సూచన రూపేణ, ప్రసాదేనా, స్వానుభవం .
0 Comments
జ్ఞాతకు జ్ఞాతయే బంధం
నిజ జ్ఞాతకు కృపయే ప్రాణం| జ్ఞాత బంధమే జ్ఞాతకు రక్షణ నిరామయమే జ్ఞాతకు పూర్ణం | గురు నిర్గుణ కృపయే నిరామయం నిజ జ్ఞాతకే విరిసేను స్వయం జ్ఞానం || దేహం సదా స్వప్న రూపం
మనస్సు సదా మిద్యా రూపం ద్రష్ట సదా కల్పనా మాత్రం స్వయం సాక్షి సదా శూన్యమాత్రం అనుభవమే సదా గురు స్వరూపం పావనం శ్రీ గురు సేవనం
మధురం శ్రీ గురు సేవనం సుజ్ఞానం శ్రీ గురు సేవనం పవిత్రం శ్రీ గురు సేవనం ప్రశాంతం శ్రీ గురు పధం మంగళం శ్రీ గురు పధం జీవం శ్రీ గురు పధం భావం శ్రీ గురు పధం సద్రూపం శ్రీ గురు జ్ఞానం చిద్రూపం శ్రీ గురు జ్ఞానం ఆనందం శ్రీ గురు జ్ఞానం అనంతం శ్రీ గురు జ్ఞానం నిర్గుణం శ్రీ గురు తత్త్వం నిర్మలం శ్రీ గురు తత్త్వం నిశ్చలం శ్రీ గురు తత్త్వం మౌనం శ్రీ గురు తత్త్వం బోధ లేనిదే జ్ఞాత వీడునా జ్ఞాన మౌనమై
కృప లేనిదే మనసు నిలుచునా స్వీయ మౌనమై ఇది అంతా స్వానుభవమే శ్రీ నిర్గుణ కృపతో ఈ జ్ఞాన మంత జ్ఞాతకే సంకేతం ఓ ప్రభూ, మది వీడెను స్వయమై మది నిలిచేగా స్వయం జ్ఞానం తో వికసించేను ఉనికి సూచన తో ఈ లేని జ్ఞాత మౌనమై నిలచేను. కృపతో ... నిర్గుణా...
ఉనికి మరిచిన ఈ లేని జ్ఞాతకు స్వయం జ్ఞాన సూచన చేయుటచే, నీ కృపతో నిరామయం తెలిపి నామ మాత్రంగా వ్యర్ద సాక్షి రూపంగ నిరతం నిలిపితివే, జ్ఞాత రహితంగా బోధలు చేసి నిరతం స్వానందం నిలిపితివే. నీ కృపతో జ్ఞాత బంధం తెలిపి నామ మాత్రముగా వ్యర్ధ బంధ రూపమున నిరతం నిలిపితివే, కేవల నిరామయ జ్ఞాన సూచన లో సాధ్య సాధన ద్వైతమే లేదని స్వయం జ్ఞానం పరిపుర్ణమే అని తెలిపి పరిపూర్ణ నిరామయం లో లేని జ్ఞాతగా నిరతం నిలిపితివే , జ్ఞాన బంధము తో విడని ఈ జ్ఞాతకు అభయమును కృపతో ప్రసాదించి నీ బోధలతో లేని జ్ఞాత లేదని నిరామయం గా నిరతము జ్ఞాతనే నిరతం నిలిపితివే. అహమస్మి …."నేను ఉన్నాను" అనే స్వానుభవ నేను ఎప్పుడు సాక్షి, జ్ఞాన, సంకల్ప, ఎరుక, మఱుపు మొదలగు లక్షణాలు కలిగిన శబ్ద,స్పర్శ, రూప, రస, గంధమనే అణు అవకాశ పూర్ణ పదార్దమే. ఈ అవగాహన కల్గించడమే నా కృప రూపమైన బోధ సూచనలు స్వీయగమనిక విధానము.
.ప్రతి వారిలో ' నేను ఉన్నాను' అనెడి ఒక ' నేను' ఉండడం అందరికి సహజమే.
' నేను' ఉన్నాననడం సహజ స్వానుభవమే కదా. ఈ స్వానుభవ ' నేను'ను 'నేను'తో గమనించడమే స్వీయ గమనిక. ఏ విశిష్ట లక్షణాలు ' నేను' కలిగి యున్నదో, ఆ విశిష్ట లక్షణాలతోనే 'తన'ను తాను జ్ఞప్తి గ ఉండడమే స్వీయ గమనిక. ఈ విధానంలో నిత్యకృత్య వ్యవహారాలు ఎంతమాత్రం ప్రతిబంధకం కానేరవు. ఈ స్వీయ గమనిక విధానంలో ' నేను'ను అజ్ఞాన అహంకారంగ చేయవలసిన అవసరం లేదని చెప్పుచున్నాను. అందువలన ప్రత్యేకించి, 'నేను'ను నిశ్చలం చేయడం గాని, శుద్దిచేయడం గాని, అణచడం గాని, దూరం చేయడం గాని, తొలగించడం గాని, రహితం చేయడం గాని, నశింపచేయడం గాని అటువంటి ప్రసక్తి ఈ స్వీయ గమనికలో ఎత్తవలసిన అవసరం లేదనియే చెప్పదలచాను. ఈ స్వీయ గమనికలో కేవలం ' నేను'ను స్మృతి జేయునట్టి నాకృప యగు బోధసూచనల వలననే పరిపూర్ణ, స్వానంద, మౌనం స్వతఃసిద్ధంగ, సహజమగునని మరల మరల చెప్పుతున్నాను. ఇచ్చట వాడ, తర్కాదుల ప్రసక్తి అప్రసక్తని మరల విన్నవించు కొంటున్నాను. అందరి దుఃఖనివృత్తి కై నా ఆవేదనలో కలిగిన 'స్వానుభవ జ్ఞప్తి' యే ఈ స్వానంద స్వీయ గమనిక విధానం. అందరికి సహజ స్వానందం స్వీయ గమనికలో జ్ఞప్తి చేయడమే నాకు స్వానందం. దేహం స్థిరమై నిలవదు రా
|