SWAMY NIRGUNA CHAITANYA-NATURAL- SELF-UNDERSTANDING.
  • Index
  • Gallery
  • About
  • Trust
  • Blog
  • Literature
  • స్వయం అవగాహన
  • Today
  • Contact
  • Index
  • Gallery
  • About
  • Trust
  • Blog
  • Literature
  • స్వయం అవగాహన
  • Today
  • Contact
Search

పరిపూర్ణం శ్రీ   గురు తత్త్వం

5/16/2020

0 Comments

 
పావనం శ్రీ గురు సేవనం
మధురం శ్రీ గురు సేవనం
సుజ్ఞానం శ్రీ గురు సేవనం
పవిత్రం శ్రీ గురు సేవనం
ప్రశాంతం శ్రీ గురు పధం
మంగళం శ్రీ గురు పధం
జీవం శ్రీ గురు పధం
భావం శ్రీ గురు పధం
సద్రూపం శ్రీ గురు జ్ఞానం
చిద్రూపం శ్రీ గురు జ్ఞానం
ఆనందం శ్రీ గురు జ్ఞానం
అనంతం శ్రీ గురు జ్ఞానం
నిర్గుణం శ్రీ గురు తత్త్వం
నిర్మలం శ్రీ గురు తత్త్వం
నిశ్చలం శ్రీ గురు తత్త్వం
మౌనం  
శ్రీ   గురు తత్త్వం
0 Comments

అంతా స్వానుభవమే శ్రీ నిర్గుణ కృపతో

5/15/2020

0 Comments

 
బోధ లేనిదే జ్ఞాత వీడునా జ్ఞాన మౌనమై
కృప లేనిదే మనసు నిలుచునా స్వీయ మౌనమై
ఇది అంతా స్వానుభవమే శ్రీ నిర్గుణ కృపతో
ఈ జ్ఞాన మంత జ్ఞాతకే సంకేతం
ఓ ప్రభూ, మది వీడెను
స్వయమై మది నిలిచేగా
స్వయం జ్ఞానం తో వికసించేను
ఉనికి సూచన తో ఈ లేని జ్ఞాత మౌనమై నిలచేను.


0 Comments

కృపతో ... నిర్గుణా...నిరతం నిలిపితివే

5/14/2020

0 Comments

 
కృపతో ... నిర్గుణా...
ఉనికి మరిచిన ఈ లేని జ్ఞాతకు స్వయం జ్ఞాన సూచన చేయుటచే,
​
నీ కృపతో నిరామయం తెలిపి నామ మాత్రంగా వ్యర్ద సాక్షి రూపంగ నిరతం నిలిపితివే,
జ్ఞాత రహితంగా బోధలు చేసి నిరతం స్వానందం నిలిపితివే.
నీ కృపతో జ్ఞాత బంధం తెలిపి నామ మాత్రముగా వ్యర్ధ బంధ రూపమున నిరతం నిలిపితివే,
కేవల నిరామయ జ్ఞాన సూచన లో సాధ్య సాధన ద్వైతమే లేదని
స్వయం జ్ఞానం పరిపుర్ణమే అని తెలిపి
పరిపూర్ణ నిరామయం లో లేని జ్ఞాతగా నిరతం నిలిపితివే ,
జ్ఞాన బంధము తో విడని ఈ జ్ఞాతకు
అభయమును కృపతో ప్రసాదించి నీ బోధలతో లేని జ్ఞాత లేదని
నిరామయం గా నిరతము జ్ఞాతనే నిరతం నిలిపితివే. 
0 Comments

అహమస్మి ….నేను ఉన్నాను

5/13/2020

0 Comments

 
అహమస్మి …."నేను ఉన్నాను" అనే స్వానుభవ నేను ఎప్పుడు సాక్షి, జ్ఞాన, సంకల్ప, ఎరుక, మఱుపు మొదలగు లక్షణాలు కలిగిన శబ్ద,స్పర్శ, రూప, రస, గంధమనే అణు అవకాశ పూర్ణ పదార్దమే. ఈ అవగాహన కల్గించడమే నా కృప రూపమైన బోధ సూచనలు స్వీయగమనిక విధానము.
0 Comments

' నేను' ను ' నేను'తో గమనించడమే స్వీయ గమనిక.

5/12/2020

0 Comments

 
.ప్రతి వారిలో ' నేను ఉన్నాను' అనెడి ఒక ' నేను' ఉండడం అందరికి సహజమే.
 ' 
నేను' ఉన్నాననడం సహజ స్వానుభవమే కదా.         
ఈ స్వానుభవ 
' నేను'ను 'నేను'తో గమనించడమే స్వీయ గమనిక.
 
ఏ విశిష్ట లక్షణాలు ' నేను' కలిగి యున్నదో, ఆ విశిష్ట లక్షణాలతోనే 'తన'ను తాను జ్ఞప్తి గ ఉండడమే స్వీయ గమనిక. 
ఈ విధానంలో నిత్యకృత్య వ్యవహారాలు ఎంతమాత్రం ప్రతిబంధకం 
కానేరవు.
ఈ స్వీయ గమనిక విధానంలో ' నేను'ను అజ్ఞాన  అహంకారంగ చేయవలసిన అవసరం లేదని చెప్పుచున్నాను.
అందువలన ప్రత్యేకించి, 'నేను'ను నిశ్చలం చేయడం గాని, శుద్దిచేయడం గాని, అణచడం గాని, దూరం చేయడం గాని, తొలగించడం గాని, రహితం చేయడం గాని, నశింపచేయడం గాని అటువంటి ప్రసక్తి ఈ స్వీయ గమనికలో ఎత్తవలసిన అవసరం లేదనియే చెప్పదలచాను.
ఈ స్వీయ గమనికలో కేవలం ' నేను'ను స్మృతి జేయునట్టి నాకృప యగు బోధసూచనల వలననే పరిపూర్ణ, స్వానంద, మౌనం స్వతఃసిద్ధంగ, సహజమగునని మరల మరల చెప్పుతున్నాను. ఇచ్చట వాడ, తర్కాదుల ప్రసక్తి అప్రసక్తని మరల విన్నవించు కొంటున్నాను.
​అందరి దుఃఖనివృత్తి కై నా ఆవేదనలో కలిగిన 'స్వానుభవ జ్ఞప్తి' యే ఈ స్వానంద స్వీయ గమనిక విధానం.
​
అందరికి సహజ స్వానందం స్వీయ గమనికలో జ్ఞప్తి చేయడమే నాకు స్వానందం.


0 Comments

నిరామయం విడువకు రా   | శ్రీ నిర్గుణ కృప ను మరువకురా

5/11/2020

0 Comments

 

 దేహం స్థిరమై నిలవదు రా 
వ్యర్ధ జ్ఞాతను నమ్మకురా |
జ్ఞాన కృప తో ఒదుగుము రా 
​నిరామయ గమనిక మరువకు రా ||

0 Comments

జ్ఞాన నిరామయం

5/10/2020

0 Comments

 

సూచన బోధల లక్ష్యం నిరామయం
 మూలం లేనిది జ్ఞాన నిరామయం |
కేవల స్మృతి మాత్రమే జ్ఞాన నిరామయం
​ఈ నిరామయ స్మృతియు కృప మాత్రమే || 

0 Comments

శ్రీ నిర్గుణ కృప

5/9/2020

0 Comments

 
బోధ సూచన రూపేణ
స్వాత్మ జిజ్ఞాస స్వాత్మానుభవం 
సహితం , ఇతి నిర్గుణ    చైతన్య
​ కృపా ప్రసాదం.
0 Comments

స్వీయ సూచన నిర్గుణ కటాక్షం

5/4/2020

0 Comments

 

గురువు శిష్యులు సదా స్వయమే 
సాధ్య సాధన సారం సదా స్వయమే |
వేదం వేదాంతం సదా స్వయమే 
కృపతో స్మృతి యైనది స్వీయ మౌనం ||

0 Comments

శ్రీ గురు చరణం విడవకురా .

5/1/2020

0 Comments

 
Picture
శ్రీ నిర్గుణ కృప ను మరువకురా       నిరామయ జ్ఞానం విడువనురా 
0 Comments
Forward>>

    Archives

    August 2020
    July 2020
    June 2020
    May 2020

    Categories

    All

    RSS Feed

Site powered by Weebly. Managed by HOSTINGRAJA.IN
  • Index
  • Gallery
  • About
  • Trust
  • Blog
  • Literature
  • స్వయం అవగాహన
  • Today
  • Contact